ప్రజాశక్తి-గుమ్మఘట్ట
మండలం పూలకుంట ఉన్నత పాఠశాలకు చెందిన బిజె మునీశ్వర్ అండర్-17 రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా మదనపల్లి ఉన్నత పాఠశాలలో ఈనెల 13, 14, 15వ తేదీలోల్ జరిగిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ఆడిన మునీశ్వర్ అత్యంత ప్రతిభ కనబచిరినట్లు తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన మునీశ్వర్‌కు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనందరావు, ఉపాధ్యాయులు సాయిప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ నాగరాజు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ముణ్వీశ్వర్‌ను అభినందిస్తున్న ఉపాధ్యాయులు







కామెంట్‌లు (0)