ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాల్య వివాహాలపై అవగాహన....

5 రోజుల క్రితం

బాల్య వివాహాలపై అవగాహన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 06:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పామిడి

మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌‌లో బాల్యవివాహాల నిరోధక చట్టం, ఆడబిడ్డ ప్రాముఖ్యత, లింగ వివక్షత, మహిళ పిల్లల హక్కుల చట్టాలపై విద్యార్థినులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బేతాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన డిప్యూటీ హెచ్ఇఒ సి.వెంకటేష్ మాట్లాడుతూ లింగ వివక్షత ద్వారా మహిళా అభివృద్ధి, సాధికారతకు అవరోధకాలన్నారు. యుక్త వయసు పిల్లలు గర్భం దాల్చడం వల్ల ఆడపిల్లల మానసిక, శారీరకంగా ఆరోగ్యం దెబ్బతిని రోగాలు బారిన పడి మృత్యువాత పడే అవకాశం ఉందని హశ్రీచ్చరించారు. ముఖ్యంగా విద్యా ద్వారా మహిళా విద్యను ప్రోత్సహించడం ద్వారా సామాజిక రుగ్మతలైన లింగ వివక్షత, బాల్యవివాహాలను, నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌‌వైజర్‌ టి.శ్రీరామిరెడ్డి, బాపూజీనాయక్, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

నినాదాలు చేస్తున్న విద్యార్థినులు, బేతాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్