అనంతపురం రూరల్ : మండలం పరిధిలోని పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం మంగళవారంతో ముగిసింది. మండల పరిధిలోని 24 పంచాయతీలకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల్లో నామినేషన్ల పర్వాన్ని ప్రశాంతంగా ముగించారు. 24 పంచాయతీలకు సర్పంచు స్థానాలకు 267 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 706 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపిడిఒ దివాకర్ తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నామినేషన్ల పర్వం ముగిసిందని తెలిపారు.
రుద్రంపేట పంచాయతీ సర్పంచు స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తున్న మహబూబీ








కామెంట్‌లు (0)