ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసులమని చెప్పి వ్యాపారి నుంచి నగదు వసూలు

3 రోజుల క్రితం

పోలీసులమని చెప్పి వ్యాపారి నుంచి నగదు వసూలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 07:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పుట్లూరు

పోలీసులమని చెప్పి వ్యాపారుల నుంచి రూ.10వేలు ఎత్తుకెళ్లిన ఘటన మండల పరిధిలోని ఎస్.గూడూరు గ్రామ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. కడప జిల్లా పులివెందుల గ్రామానికి చెందిన నాగేంద్ర రేణుకాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా తాడిపత్రి నుంచి తన టివిఎస్ వాహనంలో గూడూరుకు వస్తుండగా ఎస్.గూడూరు సమీపంలోకి రాగానే ఇద్దరు వ్యక్తులు టీ షర్టులు వేసుకుని తాము పోలీసులమని భయపెట్టి తన నుంచి రూ.10వేలు తీసుకెళ్లినట్లు వాపోయాడు. అనంతరం గూడూరు వద్ద ఎన్నికల బందోబస్తులో ఉన్న పోలీసుల వద్దకు వెళ్లి తన గోడును వెల్లబోసుకున్నాడు. అయితే వారు విచారించడంతో పోలీసులు కాదు.. నకిలీ వ్యక్తులు డబ్బులు వసూలు చేశారని తెలిపారు. దీంతో బాధితుడు లబోదిబోమన్నాడు. వెంటనే పుట్లూరు పోలీస్‌‌స్టేషన్‌‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఫోటో రైట్ అప్. బందోవస్తు వద్ద ఉన్న పోలీసులకు బోరున ఏడిపిస్తూ ఉన్న వ్యాపారస్తుడు నాగేంద్ర

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్