ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నాలుగు మండలాల్లో ఎంపిపి ఎంపిక పూర్తి- కోరం లేక కళ్యాణదుర్గం ఎంపిపి వాయిదా

3 రోజుల క్రితం

నాలుగు మండలాల్లో ఎంపిపి ఎంపిక పూర్తి
కోరం లేక కళ్యాణదుర్గం ఎంపిపి వాయిదా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 07:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -కళ్యాణదుర్గం టౌన్

కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎంపిపి ప్రక్రియ గురువారం జరిగింది. ఆయా మండలాల్లో మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రిసైడింగ్ అధికారుల సమక్షంలో ఎంపిటిసిల ప్రమాణ స్వీకారం నిర్వహించారు.

కంబదూరు మండలంలో మండలంలో మరిమాకులపల్లి ఎంపీటీసీ సభ్యురాలు తిప్పక్క (ఎస్సీ) ఎంపిపిగా, వైసిపి ఎంపిపిగా నూతిమడుగు ఎంపిటిసి గొల్ల దేవేంద్ర స్వీకారం చేశారు. అలాగే శెట్టూరు ఎంపిపిగా ములకలేడు ఎంపిటిసి నడిమింటి రామలక్ష్మి (ఎస్సీ), వైస్‌ ఎంపిపిగా గాజుల మనోహర్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే కుందుర్పి ఎంపిపిగా గాజుల మంజుల రాఘవేంద్ర, వైస్‌ ఎంపిపిగా సజ్జల వెంకటేశులు ప్రమాణ స్వీకారం చేశారు. బ్రహ్మసముద్రం ఎంపిపిగా కురుబ లావణ్య, వైస్‌ ఎంపిపిగా లక్ష్మీబాయి ప్రమాణ స్వీకారం చేశారు.

కళ్యాణదుర్గం ఎంపిపి ఎన్నిక వాయిదా..

కళ్యాణదుర్గం ఎంపిపి ఎన్నిక వాయి పడింది. మండలంలో 13 ఎంపిటిసి స్థానాలు ఉండగా 13 స్థానాల్లో టిడిపి అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ ఎంపిపి పదవి కోసం దురుదుకుంటా ఎంపిటిసి గంటా శశికళ, తూర్పుకోడి పల్లి ఎంపిటిసి కమ్మ సింధుశ్రీ మధ్య పోటీ నెలకొంది. ఈ విషయంలో కాసేపు మండల పరిషత్ కార్యాలయం వద్ద వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో చాలామంది ఎంపిటిసి సభ్యులు హాజరుకాకపోవడంతో కోరం లేక వాయిదా వేసినట్లు ప్రిసైడింగ్ అధికారి వెంకటేశ్వర్లు ప్రకటించారు.

సెట్టూరు ఎంపీపీ నడిమింటి రామలక్ష్మి

కంబదూర్ ఎంపీపీ దేకుల తిమ్మక్క

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్