ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
అనంతపురం కెఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అంతర్ కళాశాల మహిళా క్రీడా పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలుగా నిలిచారు. గుంతకల్లు ఎస్‌ఎస్‌జీఎస్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పోటీలలో ధర్మవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేఎస్ఎన్ కళాశాల జట్టు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి విజయం సాధించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ప్రగతి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.రమణ నాయుడు, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ సి. గౌతమి విజేతలైన విద్యార్థినులను అభినందించారు. విద్యార్థినులు క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.








కామెంట్‌లు (0)