ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
సమాజంపై తీవ్ర ప్రభావం చూపే డ్రగ్స్, మద్యం, మొబైల్‌కు దూరంగా ఉండాలని జెవివి నాయకులు డాక్టర్ కృష్ణమూర్తి సూచించారు. జనవిజ్ఞాన వేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నవభారత్ హైస్కూలో విద్యార్థులకు పాటలు, మ్యాజిక్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రగ్స్, మొబైల్ అడిక్ట్ వల్ల నష్టాపై అవగాహన కల్పించారు. ప్రసాద్,తిప్పే స్వామి మ్యాజిక్ చేయడం, డాక్టర్ భాస్కర్ రావు జనవిజ్ఞాన వేదిక చేసిన చేస్తున్న కార్యక్రమాలు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శశిభూషణ్, జెవివి నగర కమిటీ సభ్యులు నాగ రంగయ్య, మసూద్‌వలి, తిరుపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జెవివి నాయకులు








కామెంట్‌లు (0)