ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జిల్లా యువజన ఉత్సవాల్లో ‘కెఎస్ఎన్’ విద్యార్థినుల విజయకేతనం

1 రోజు క్రితం

జిల్లా యువజన ఉత్సవాల్లో ‘కెఎస్ఎన్’ విద్యార్థినుల విజయకేతనం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 08:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి అనంతపురం కలెక్టరేట్

జిల్లా యువజనోత్సవాల్లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించిన కెఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ ఎం. ప్రగతి అభినందించారు. ఆర్ట్స్ కళాశాలలో జిల్లా యువజన సర్వీసుల శాఖ నిర్వహించిన పోటీలలో జానపద బృంద నాట్య విభాగంలో ప్రథమస్థానంలోనూ, జానపద గీతాలాపనలో రెండవస్థానంలోనూ కె.ఎస్.ఎన్. ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు గెలుపొందడంపై ప్రిన్సిపాల్ హర్షం వ్యక్తంచేశారు. విద్యార్థినులకు తర్ఫీదునిచ్చిన శిక్షకులు, అధ్యాపకులకు ధన్యవాదాలు తెపారు. జిల్లాస్థాయిలో అగ్రగామిగా నిలిచి, రాష్ట్ర స్థాయిలో జిల్లా తరఫున పాల్గొనబోతున్న విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్రస్థాయిలో కూడా విజేతలై తిరిగిరావాలని ఆకాంక్షించారు. అభినందించిన వారిలో ప్రిన్సిపాల్ ప్రగతి, వైస్ ప్రిన్సిపాల్ బి.రమణనాయుడు, విశ్రాంత ప్రిన్సిపాల్ ఎ.చంద్రశేఖర్, అధ్యాపకులు రామకృష్ణ, రాధిక, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ సి.గౌతమి, తదితరుల అభినందించారు.

విద్యార్థినులను అభినందిస్తున్న కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్