మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుడిలోకి వచ్చారని దళితులపై దాడి

1 రోజు క్రితం

గుడిలోకి వచ్చారని దళితులపై దాడి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 01:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- బుక్కరాయసముద్రం

(అనంతపురం జిల్లా)

శివమాల వేసిన దళితులు ఆలయ ప్రవేశం చేశాడంటూ పెత్తందారులు దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌‌సి రిజర్వు నియోజకవర్గమైన శింగనమలలోని బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆదివారం వీడియో సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయింది. నాగేష్‌ అనే దళితుడు శివమాల ధరించి ఉన్నారు. ఆయనతో పాటు 30 మంది దళితులు కూడా శివమాల ధరించారు. వీరు ఆదివారం గ్రామంలోని పోతలప్ప స్వామి ఆలయం వద్దకు దినచర్యలో భాగంగా పూజ చేసుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన అంకే ఓబులేసు, ఓబుళపతితో పాటు మరికొందరు దళితులు ఆలయం వద్దకు వచ్చినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాదిగోళ్లు గుడిలోకి రాకూడదు. గుడి దగ్గర కూర్చోకూడదు’ అంటూ దుర్భాషలాడారు. గ్రామంలోని ఆలయంలోకి వెళ్లారంటా వీరితోపాటు కొంతమంది గ్రామ పెత్తందారులు దళిత యువకులపైకి వచ్చారు. దళిత యువకుడు నాగేష్, తదితరులపై పెత్తందారులు దాడి చేశారు. తమపై జరిగిన దాడిపై బాధిత యువకులు బుక్కరాయసముద్రం పోలీస్‌ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులపై ఎస్‌‌సి, ఎస్‌‌టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆందోళనకు దిగారు. దళిత యువకులపై జరిగిన దాడిని పలు దళిత సంఘాలు ఖండించాయి. కుల వివక్షకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌ చేశాయి. ఈ సందర్భంగా డప్పు కళాకారుల జిల్లా కార్యదర్శి అంజినేయులు మాట్లాడుతూ దళితులపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్