ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం నగరపాలక సంస్థ నాలుగో సర్కిల్‌లో విధులు నిర్వహిస్తూ అనారోగ్య సమస్యలతో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు హెచ్. ఎర్రిస్వామి కుటుంబానికి తోటి మున్సిపల్ కార్మికులు అండగా నిలిచారు. తోటి కార్మికుల నుంచి ఒకరోజు వేతనం చొప్పున సేకరించిన మొత్తం రూ.76,000లను శనివారం అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ రావు చేతుల మీదుగా ఎర్రిస్వామి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి ముత్తుజ, మున్సిపల్ యూనియన్ నగర అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్, సాకే తిరుమలేశు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిరంతరం పోరాటాలు చేస్తోందని, కార్మికుల హక్కుల సాధనతో పాటు విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలోనూ తోటి కార్మికులు ముందుంటున్నారని తెలిపారు. కార్మికుల కష్టసుఖాల్లో సిఐటియు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.అదేవిధంగా అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ రావు చొరవతో గతంలో చనిపోయిన, రిటైర్మెంట్ అయిన 30 మంది కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. గత నాలుగు నెలల కాలంలో మరో ముగ్గురు మున్సిపల్ కార్మికులు మరణించారని, వారి కుటుంబాలకు కూడా ఉపాధి కల్పించాలని కమిషనర్ ని కోరినట్లు తెలిపారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ, వీలైనంత త్వరగా మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించడంతో పాటు, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్‌ను కూడా అందజేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ సహాయ కార్యదర్శి బండారి స్వామి, ఉపాధ్యక్షులు రాఘవ, పెన్నోబులేసు, కమిటీ సభ్యులు మరియమ్మ, కుళ్లాయప్ప, రామాంజి తదితరులు పాల్గొన్నారు.
మృతి చెందిన కార్మికుని కుటుంబానికి కార్మికుల ఆర్థిక చేయూత : సిఐటియు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026, 04:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)