ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పీలేరులో 610 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు

18 గంటల క్రితం

610 postal ballot votes recorded in Pileru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 04:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

14 పంచాయతీల సర్పంచులకు 415 ఓట్లు..

15 పంచాయతీల వార్డులకు 195 ఓట్లు


ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : పీలేరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌లో మొత్తం 610 ఓట్లు నమోదయ్యాయని ఎంపీడీవో శివశంకర్ వెల్లడించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా శనివారం ఎంపీడీవో మీడియాతో మాట్లాడుతూ ... మండల పరిధిలోని 14 గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి 415 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయన్నారు. అలాగే 15 గ్రామ పంచాయతీల పరిధిలోని వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి 195 ఓట్లు నమోదయ్యాయన్నారు. మొత్తంగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు కలిపి 610 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి తెలిపారు. ఈ నెల 29వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు.
610 postal ballot votes recorded in Pileru


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్