ఆగస్టు 31న కౌన్సెలింగ్.. పదో తరగతి ఫెయిల్ అభ్యర్థులకు వెల్డర్ కోర్సులో అవకాశం
ప్రజాశక్తి-పీలేరు: అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నాలుగో విడత ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, పీలేరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ పి. నారాయణ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పుంగనూరు, తంబళ్లపల్లె ప్రభుత్వ ఐటీఐలతో పాటు గుర్రంకొండ, ములకలచెరువు, మదనపల్లె, వాయల్పాడు, పుంగనూరు, పీలేరు, రాయచోటి తదితర ప్రాంతాల్లోని ప్రైవేట్ ఐటీఐల్లో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ఆగస్టు 31న ఉదయం 11.30 గంటలలోపు ఐటీఐ అడ్మిషన్స్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని సూచించారు. పదో తరగతి ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా వెల్డర్ కోర్సుకు అర్హులు అని అదే రోజు ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు ఫొటోలు, వెరిఫికేషన్ ఫారంతో సంబంధిత ఐటీఐలకు సకాలంలో హాజరు కావాలని సూచించారు. విద్యార్థులు తమ వెంట ఎస్‌ఎస్‌సీ ఒరిజినల్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువపత్రం, ఆధార్ కార్డు, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌తో పాటు ప్రతి ధ్రువపత్రానికి రెండు జిరాక్స్ కాపీలు తీసుకురావాలని అధికారులు తెలిపారు.







కామెంట్‌లు (0)