ప్రజాశక్తి - బి.కొత్తకోట (అన్నమయ్య) : డి.ఎస్.పి ఎం.బుచ్చిరాజు శనివారం బి.కొత్తకోట పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఏడాదిపాటు జరిగిన నేరాల రికార్డులు, స్టేషన్ రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ... గతంతో పోల్చుకుంటే నేరాల శాతం తగ్గిందన్నారు. బి.కొత్తకోట కర్ణాటక సరిహద్దుల్లో ఉండడంతో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. శాంతి, భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దన్నారు. నేరాల శాతాన్ని మరింత తగ్గించాడానికి కృషి చేయాలన్నారు. సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ గోపాల్ రెడ్డి, ఎస్.ఐ బాలాజీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
డీఎస్పీ ఆకస్మిక తనిఖీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 22, 2026, 03:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)