ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్రామీణ ప్రాంతంలో అత్యవసర వైద్యశాల ఏర్పాటు సంతోషకరం

1 గంట క్రితం

hospital
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 01:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

ప్రజాశక్తి - కలకడ: గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా అత్యవసర వైద్యశాలను ఏర్పాటు చేయడం సంతోషకరమని పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం డాక్టర్ కోట హర్షవర్ధన్ నాయుడు ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, నల్లారి అభిమానులు ఆయనకు శాలువాలతో సన్మానం చేసి, పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. మండల కేంద్రమైన కలకడ-గుర్రంకొండ రోడ్డులోని చరపల్లి రాజా నాయుడు నూతనంగా నిర్మించిన గృహంలో ఏర్పాటు చేసిన "కోట రమణ ఎమర్జెన్సీ వైద్యశాల"ను ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్యం అందించేందుకు కలకడలో ఈ ఎమర్జెన్సీ వైద్యశాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, సుదూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేని పేద ప్రజలకు ఈ ఆసుపత్రి ఎంతో ఉపయోగకరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వైద్య సదుపాయాలు రావడం వల్ల ఎంతో మంది ప్రాణాలు సకాలంలో కాపాడబడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, నల్లారి అభిమానులు, ఆసుపత్రి సిబ్బంది మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్