ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

చేనేత కార్మికులకు ఆరాధ్యులు ప్రగడ కోటయ్య

1 గంట క్రితం

cm cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 08:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, చేనేత కార్మికుల హక్కుల కోసం పోరాడిన ప్రగడ కోటయ్య గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన కోటయ్య కోట్లాది మంది చేనేత కార్మికులకు ఆరాధ్యుడు అయ్యారని తెలిపారు. ఆయన జయంతి సందర్భంగా ఆ చేనేత రంగ పితామహుడికి ఘన నివాళంటూ సామాజిక మాధ్యం ఎక్స్‌‌లో పేర్కొన్నారు.

చేనేతల ఆత్మగౌరవాన్ని పెంచిన కోటయ్య

చేనేతల ఆత్మ గౌరవాన్ని పెంచుతూ, ప్రగడ కోటయ్య సేవలు భావి తరాలకు తెలియజేయాలన్న సంకల్పంతో ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్‌.సవిత పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్