mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హార్స్లీ హిల్స్‌ను ప్లాస్టిక్ రహిత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుదాం

11 జూన్, 2026

Horsley Hills.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 11, 2026, 12:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కలెక్టర్ నిశాంత్ కుమార్

  • హారీ హిల్స్లో ప్లాస్టిక్ ఫ్రీ జోస్ పై అవగాహనా కార్యక్రమాలు

ప్రజాశక్తి – బి.కొత్తకోట: జిల్లాస్థాయి యోగాంధ్ర కార్యక్రమం మరియు ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2026 సందర్భంగా అన్నమయ్య జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం, ప్రదర్శన నిర్వహించారు. “Let’s Together Make Horsley Hills a Plastic Free Zone” అనే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2026 పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, ప్రజలు పాటించాల్సిన సూచనలు, చేయవలసినవి – చేయకూడనివి తదితర అంశాలను ప్రదర్శనలో వివరించారు. ప్లాస్టిక్ బ్యాగులు మరియు ప్లాస్టిక్ ఉత్పత్తులను తగ్గించి, ప్రత్యామ్నాయ పదార్థాలతో తయారు చేసిన వస్తువులను ఎంచుకునేందుకు, హార్స్లీ హిల్స్లో ప్రాంతంలో మరియు చుట్టుపక్కల అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వస్తువుల వల్ల కలిగే హానిపై పర్యావరణ అవగాహన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆర్.ఓ. తాగునీటి ప్లాంట్‌ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు. అలాగే ప్లాస్టిక్ నీటి సీసాల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో గాజు నీటి సీసాల పంపిణీ కేంద్రాలు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచుల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…, హార్స్లీ హిల్స్ వంటి ప్రకృతి సౌందర్య ప్రాంతాలను కాలుష్య రహితంగా కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత వస్తువులను ఉపయోగించడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించవచ్చని పేర్కొన్నారు. హార్స్లీ హిల్స్‌ను పూర్తిస్థాయి ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో భాగంగా పర్యావరణ ఇంజనీర్ సుధా కురుబ ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి ప్లాస్టిక్ వస్తువులను నివారించడం మరియు ప్రత్యామ్నాయ పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులను ఉపయోగించడం గురించి పాల్గొన్నవారికి మరియు పర్యాటకులకు అవగాహన కలిగించారు.  అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో ప్లాస్టిక్ వినియోగాన్ని విడనాడి, ప్రత్యామ్నాయ పదార్థాలతో చేసిన వస్తువులను ఎంచుకునేలా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం కడప పర్యావరణ ఇంజనీర్ సుధా కురుబ, వివిధ శాఖల జిల్లా అధికారులు, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, విస్టా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రీం లైన్ డైరీ, జువారీ సిమెంట్స్, భారతీ సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ (అల్ట్రాటెక్ సిమెంట్స్), యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జిఎం ఎకో సర్వీసెస్ తదితర పరిశ్రమల సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్