మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాలిక అనుమానాస్పద మృతి ..

1 గంట క్రితం

Suspicious death of a girl
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 12:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్య) : బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మంగళవారం కెవిపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన సమాచారం మేరకు ... అన్నమయ్య జిల్లా కె.వి పెళ్లి మండలం గ్యారంపల్లి కొత్తపల్లిలో కాపురం ఉంటున్న కట్టెల మురళి, కట్టెల రమణమ్మలకు ఇద్దరు సంతానం. వీరిలో పెద్ద కుమార్తె శాలిని (15) స్థానిక కొత్తపల్లి పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. సోమవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు ఇంటికి వచ్చిందని, ఇంటిలో ఉన్న వారితో సంతోషంగా గడిపిందని తెలిపారు. అనంతరం అదే రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో మూత్ర విసర్జనకు వెళ్లిన కుమార్తె ఎంతసేపటికి రాకపోవడంతో శాలిని తల్లి రమణమ్మ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో వెతికినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇంటికి సమీపంలో ఉన్న ఒక పాకలో శాలిని ఉరేసుకొని కనిపించడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించి, చుట్టుపక్కల వారి సహకారంతో శాలినీని కొత్తపల్లిలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు పరీక్ష నిమిత్తం తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్లు బాలిక మృతి చెందినట్లు తెలపడంతో అక్కడనుండి తన కుమార్తె బతికే ఉందేమోనన్న ఆశతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించారు. అక్కడ డాక్టర్లు కూడా బాలిక మృతి చెందినట్లు తెలిపారని వివరించారు. ఈ క్రమంలో తన కుమార్తె ఉరివేసుకొని మృతి చెందేంత పిరికిది కాదని, తన కుమార్తె ఆత్మహత్యకు కారణాలు ఏమైనా ఉండవచ్చునని పోలీసు ఆరా తీసి తమకు న్యాయం చేయాలని, మృతురాలి తల్లి రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ కోదండ రామయ్య కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్