శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

షార్ట్ సర్క్యూట్ తో వరిగడ్డి ట్రాక్టర్ దగ్ధం

1 గంట క్రితం

Tractor carrying paddy straw gutted by fire due to short circuit.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 12:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్య) : షార్ట్ సర్క్యూట్ తో వరిగడ్డి ట్రాక్టర్ దగ్ధమైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రమైన కలకడ మహబూబ్ నగర్ సమీపంలో ఉన్న వ్యవసాయ పొలం వద్ద గల ఆవుల షెడ్డు నందు ఆవుల కోసం బస్సు గ్రాసం అవసర నిమిత్తం రైతు సుల్తానీ భాష వరిగడ్డి ట్రాక్టర్ తో బేరం కుదుర్చుకుని షెడ్డు వరకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ వీధిలో వరిగడ్డితో ఉన్న ట్రాక్టర్ పోతున్న సమయంలో విద్యుత్ వైర్లు కింద ఉండటంతో వరిగడ్డ ట్రాక్టర్కు తగిలినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో వరిగడ్డి ట్రాక్టర్ తగలడం వల్ల సర్వీసు వైరు తెగపోవడంతో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలియజేశారు. అయితే స్థానికులు అంతా కలిసి మంటలను ఆరిపోయేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో వరిగడ్డితో ఉన్న ట్రాక్టర్ కు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వరిగడ్డితో ఉన్న ట్రాక్టర్, వరిగడ్డి పూర్తిగా అగ్నికి ఆహుతి అవుతున్న తరుణంలో స్థానికులు పీలేరు అగ్నిమాపక దళం కు సమాచార అందించినట్టు తెలిపారు .వెంటనే పీలేరు అగ్నిమాపక సిబ్బంది స్పందించి హుటాహుటిన కలకడక చేరుకొని మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. ప్రమాదానికి గురైన వరిగడ్డి సుమారు రూ.40 వేల రూపాయలకు పైన ఉంటుందని రైతు వాపోయాడు.అయితే వరిగడ్డి మాత్రమే కాలిపోయి ప్రమాదం ఉధృతం కాకుండా పీలేరు అగ్నిమాపక సిబ్బంది సమయానికి వచ్చి మంటలు అదుపు చేయడంతో మరింత నష్టం జరగలేదని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ కార్యక్రమంలో పీలేరు ఫైర్ ఇంజన్ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్