జింకా వెంకట చలపతిని పక్కకు లాగిన పోలీసులు.. రోడ్డుపై బైఠాయించి ఆందోళన
ప్రజాశక్తి–బి.కొత్తకోట : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బి.కొత్తకోటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ నంబర్ 16లో వైఎస్ఆర్‌సీపీ ఏజెంట్లను పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని, టీడీపీ ఏజెంట్లను మాత్రం అనుమతించి మాక్ పోలింగ్ నిర్వహించారని వైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జింకా వెంకట చలపతి ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని అధికారులను ప్రశ్నించారు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న ఎస్‌ఐ శివకుమార్‌తో పాటు పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, లాఠీతో కొట్టడంతో పాటు తోసివేయడంతో తనకు గాయాలయ్యాయని చలపతి ఆరోపించారు. దీంతో ఆయన అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. తమ పార్టీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించే వరకు నిరసన విరమించబోనని స్పష్టం చేశారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.







కామెంట్‌లు (0)