ప్రజాశక్తి - యద్దనపూడి : మండలంలోని అనంతవరం గ్రామములోని మెయిన్ ( పంచాయతీ )అంగన్వాడి సెంటర్ నందు మంగళవారం పోషణ మాసోత్సవం మరియు అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త భూలక్ష్మి మాట్లాడుతూ.. తల్లులు ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారాన్ని తల్లులు ఇంటి వద్ద కూడా క్రమం తప్పకుండా పెట్టినట్లయితే వాళ్ళు పూర్తి ఆరోగ్యంతో ఉంటారని దాని ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. అంతే కాకుండా తృణ దాన్యాలు వాటిలో ఉండే పోషకాలు గురించి వివరించారు. తృణ ధాన్యాలు వాడటం వల్ల చిన్న పిల్లలు పెద్ద వారిలో కూడా వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధులు బారిన పడకుండా ఉంటారు అని చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ ఆయా ప్రేమానందం, చిన్నారుల తల్లులు ఈశ్వరమ్మ, రజని, భానుమతి, తీరిష్మ, మల్లేశ్వరి, అంజలి, విజయ కుమారి, చంద్ బి, శ్రీదేవి,తదితరులు పాల్గొన్నారు.
యద్దనపూడిలో అంగన్వాడీ ఉత్సవం
06 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 06, 2026, 05:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)