శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బోల్తాపడిన కారు - ఇద్దరు మృతి

6 రోజుల క్రితం

Car overturns two dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 04:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : కారంచేడు చీరాల జాతీయ రహదారిలోని కుంకలమర్రు ఫ్లైఓవర్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చీరాల వైద్యశాలకు తరలించారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని పెళ్లూరు సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుండి బాపట్లకు వస్తున్న AP 40 LH 5055 నంబరు గల మారుతి సుజుకి ఎర్టిగా కారులో ఆరుగురు ప్రయాణిస్తుండగా, ఫేస్ కాలేజ్ దాటిన అనంతరం డ్రైవర్ ప్రవీణ్ నిద్రమత్తులో ఉండడంతో రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు గోడను బలంగా ఢీకొట్టాడు. దీంతో కారు పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బాపట్లకు చెందిన డ్రైవర్ ప్రవీణ్, వెంకట్రావు, సుజాత, సీతా మహాలక్ష్మి మరణించారు. కొత్తగా వివాహమైన జంట శ్రీతేజ, కైవల్య లకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈనెల 18వ తేదీన బాపట్ల కమ్మ కళ్యాణ మండపంలో వివాహం జరిగింది. తిరుపతి కి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెళ్ళికొడుకు శ్రీ తేజ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెళ్లికూతురు కైవల్య తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
car accident




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్