- కౌన్సిలర్ లు అందరు ఏకగ్రీవంగా ఎన్నిక
ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : చీరాల మున్సిపల్ వైస్ చైర్మన్ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వీడింది. వైస్ చైర్మన్ గా 24 వార్డు కౌన్సిలర్ తెల్లప్రోలు రమేష్ కుమార్ ను అధిష్టానం వైస్ చైర్మన్ గా ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో చైర్మన్ హనీ స్పందన ప్రమాణ స్వీకారం అనంతరం కౌన్సిలర్లు అందరూ తెలప్రోలు రమేష్ ను వైస్ చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ సందర్భంగా ఎంపి కృష్ణ ప్రసాద్ ,ఎమ్మెల్యే కొండయ్య, యువ నేతలు మహేంద్ర నాథ్,అమర్నాథ్ లు,పార్టీ నేతలు అందరూ రమేష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.







కామెంట్‌లు (0)