ప్రజాశక్తి-కారంచేడు (బాపట్ల) : స్థానిక కారంచేడు శాఖా గ్రంధాలయం లో గ్రంథాలయ ఉత్సవాల 5 రోజు సందర్భంగా బుధవారం నాడు కారంచేడు లోని యార్లగడ్డ నాయనమ్మ ఉన్నత పాఠశాల లో గ్రంథపాలకుల అధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు ఎస్సే రైటింగ్, కాంపిటీషన్స్ ,వక్రత పోటీలు, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం ఏ శివరాం ప్రసాద్ , పిడి షేక్ మస్తానీ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహణ జరిగింది.ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ఈనెల 20వ తేదీన జరుగు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సభలో బహుమతి ప్రధానము జరుగుతుందని గ్రంథ పాలకులు యం నాగయ్య తెలిపారు.
గ్రంథాలయ ఉత్సవాలు - విద్యార్థులకు పోటీలు
18 నవంబర్, 2026
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 18, 2026, 03:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)