శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వ ఉద్యోగుల పాత బకాయిలు విడుదల చేయాలని ఆందోళన

3 రోజుల క్రితం

1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 04:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి, కారంచేడు : ప్రభుత్వ ఉద్యోగులకు 2018 నుంచి రావలసినటువంటి వివిధ రకాల బకాయిలు విడుదల చేయాలని మంగళవారం నాడు స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ జేఏసీ, ఏపీ రెవిన్యూ సర్వీస్ ఉద్యోగులు నాయకులు చేగుడి సురేష్ బాబు, తహసిల్దార్ మాధవి లత గోడపత్రిక విడుదల చేశారు. అలాగే ఉద్యోగులంతా వాట్సాప్ డీపీలో తమ ఆందోళన డిమాండ్ కు సంబంధించి డీపీ స్టేటస్ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2018 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి అరియర్స్, 5 డీఎలు, సరెండర్ లీవులు అలాగే 2023 నుంచి ఐ ఆర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, మండల పరిషత్ ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్