శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

1 గంట క్రితం

pass book.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 01:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల మండలం గోపాపురం గ్రామంలో సమగ్ర భూ రీ-సర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పంపిణీ చేశారు. అత్యాధునిక భద్రతా ప్రమాణాలు, అధికారిక రాజముద్రతో రూపొందించిన పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుల భూములకు పూర్తి రక్షణ కల్పించడమే రీ-సర్వే లక్ష్యమన్నారు. నూతన పాస్ పుస్తకాల్లో అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నందున భూముల విషయంలో భవిష్యత్తులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా భద్రత కల్పిస్తాయని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్