శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

2 రోజుల క్రితం

Distribution of Pattadar Passbooks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 03:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - వేటపాలెం (బాపట్ల) : భూముల విలువ పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం పరిధిని దాటిపోయింది అని రైతులు తమ భూములను జాగ్రత్తగా కాపాడుకొని భవిష్యత్తు తరాలకు వారసత్వంగా ఇవ్వాలని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అన్నారు.మండలంలోని దేశాయిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రైతులకు కొత్త పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడుతూ గత ప్రభుత్వం జగన్ ఫోటోతో జారీ చేసిన పాసుపుస్తకాల్లోని తప్పిదాలను సవరించి, ప్రభుత్వ రాజముద్రతోపాటు క్యూఆర్ కోడ్ తో రూపొందించిన కొత్త పాసు పుస్తకాలను రైతులకు, భూయజమానులకు అందజేయడం జరుగుతుందన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజల పాలిట మరణ శాసనంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌‌ ను రద్దు చేయడం జరిగిందని, రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. రెవెన్యూ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పనితీరు మెరుగుపరచుకోకపోతే రాబోయే సాధారణ బదిలీల్లో నియోజకవర్గంలో ఎక్కడా అవకాశం లేకుండా చేస్తానని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీవో ఎస్.నరసింహరావు,వేటపాలెం తహసిల్దార్ జి గీతారాణి,ఏఎంసీచైర్మన్ కౌతరపు జనార్ధన్, చీరాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రైతు అధ్యక్షులు పోలకం శేఖర్, సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య,పందిళ్ళపల్లి పీఏసీఎస్ అధ్యక్షులు పల్లపోలు శ్రీనివాసరావు, దేశాయిపేట గ్రామ టీడీపీ అధ్యక్షులు మాచర్ల సాంబశివరావు, లబ్ధిదారులు, కూటమి నాయకులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్