శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చెన్నైలో ‘లెహ్రా దో తిరంగా’ కార్యక్రమంలో పాల్గొన్న కనిమొళి

1 గంట క్రితం

dmk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 02:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థుల సంఘాలు చేపడుతున్న ఆందోళనకు డిఎంకె ఎంపి కనిమొళి సంఘీభావం ప్రకటించారు. సిజెపి వ్యవస్థాపకుడు దీప్కే ఇచ్చిన ‘లెహ్రా దో తిరంగా’ పిలుపుమేరకు శుక్రవారం చెన్నైలో విద్యార్థులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈకార్యక్రమానికి కనిమొళి హాజరయ్యారు. యువత ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సర్‌కి వ్యతిరేకంగా డిఎంకె ప్రజలను హెచ్చరించిందని అన్నారు. ఎన్నికలకు ముందే తమ నేత ఎం.కె.స్టాలిన్‌ ప్రజలకు హెచ్చరించారని అన్నారు. సర్‌ కి వ్యతిరేకంగా దేశంలోని యువత నిరసన తె లిపేందుకు ఐక్యం కావడం ఎంతో ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుందని అన్నారు. డిఎంకె ఈ ఆందోళనకు మద్దతునిస్తుందని పునరుద్ఘాటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్