శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నీట్ పేపర్ లీకేజీపై చీరాలలో విద్యాసంస్థల బంద్

24 జులై, 2026

Educational institutions shut down in Chirala over NEET paper leak.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 10:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్

  • విద్యార్థులతో ర్యాలీ


ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చీరాలలో విద్యాసంస్థల బంద్ కొనసాగింది. శుక్రవారం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా, ఎఐకేఎస్, ఎఐఏడబ్ల్యూయూ ఆధ్వర్యంలో స్థానిక మహిళా కళాశాల నుంచి విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ నాయకులు మాట్లాడుతూ ... నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై జాతీయ స్థాయిలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, యువతపై పోలీసుల నిరంకుశ వైఖరిని ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, విద్యా వ్యవస్థను కార్పొరేట్ దళారుల సంస్థల ప్రభావం నుంచి విముక్తి చేయాలని వారు కోరారు. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్