- చైర్మన్ అభ్యర్థి విషయంలో వీడిన ఉత్కంఠ
ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : చీరాల టిడిపి చైర్మన్ అభ్యర్థి విషయంలో గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. చీరాల 17వ వార్డు హైయిర్ పేటకు చెందిన ఏరిచర్ల షైనీ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో టిడిపి చైర్మన్ అభ్యర్థి విషయంలో నెలకొన్న అనిశ్చిత వీడింది. చైర్మన్ పీఠం కోసం ప్రధానంగా వైసిపి అభ్యర్థిగా డాక్టర్ ఇస్తర్ల షెర్లీ, టిడిపి అభ్యర్థిగా ఎరిచర్ల హనీ స్పందన మధ్య పోటీ నెలకొంది. దీంతో చైర్మన్ పీఠంపై పోరు ఆసక్తికరంగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది తెలియాల్సి ఉంది. అభ్యర్థి విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది తెలియాల్సి ఉంది.





కామెంట్లు (0)