అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే మాలకొండయ్య ఆమోదం
ప్రజాశక్తి - చీరాల: చీరాల మండలం గవినివారిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా టిడిపి తరఫున గవిని నాగేశ్వరరావును ఖరారు చేశారు. ఆయన అభ్యర్థిత్వానికి చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా గవిని నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి అవసరాలను గుర్తించి సంబంధిత అధికారుల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గ్రామంలో తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. గవినివారిపాలెం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ఆశయమని వెల్లడించారు. తనపై నమ్మకంతో సర్పంచి అభ్యర్థిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.







కామెంట్‌లు (0)