- చీరాల జయలక్ష్మి ఆటోమొబైల్స్‌లో ప్రారంభం
- ముఖ్య అతిథిగా హాజరైన కేపాల్ జనరల్ మేనేజర్ కె సత్యనారాయణ
- బుకింగ్స్ ప్రారంభమైనట్లు షోరూం మేనేజర్ ఎస్. గయాజ్ వెల్లడి
ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : చీరాల కొత్తపేట పంచాయతీ పరిధిలో ఆర్టీఓ కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న జయలక్ష్మి ఆటోమొబైల్స్ మారుతి షోరూంలో నూతన మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కారు ఆవిష్కరణ వేడుక ఘనంగా నిర్వహించారు. షోరూం మేనేజర్ ఎస్ గయాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేపాల్ జనరల్ మేనేజర్ కె. సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై నూతన మోడల్ కారును ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కె సత్యనారాయణ మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి ఆధునిక సాంకేతికతతో కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకువస్తోందన్నారు. జయలక్ష్మి ఆటోమొబైల్స్ నాణ్యమైన విక్రయ, సేవా సదుపాయాలతో వినియోగదారుల విశ్వాసాన్ని పొందుతోందని తెలిపారు.షోరూం మేనేజర్ ఎస్ గయాజ్ మాట్లాడుతూ అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన నూతన బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కారు అన్ని వర్గాల వినియోగదారులకు అనువైన ధరలో అందుబాటులో ఉంటుందన్నారు. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 1.0 లీటర్ టర్బో ఇంజిన్, 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో ఈ వాహనం లభిస్తుందని చెప్పారు. ఆసక్తి గల వినియోగదారులు బుకింగ్‌ల కోసం జయలక్ష్మి ఆటోమొబైల్స్ మారుతి షోరూంను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జయలక్ష్మి ఆటోమొబైల్స్ ఏఎస్‌ఎం ఎం. వెంకటేష్, టీమ్ లీడర్ కె. విజయ్, వినియోగదారులు, ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులు, షోరూం సిబ్బంది పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)