మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

1 గంట క్రితం

raly.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 10:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • లేకుంటే విద్యుత్‌ సౌధ ముట్టడి

  • బైక్‌ జాతాలో యూనియన్‌ నాయకులు హెచ్చరిక

ప్రజాశక్తి-గుంటూరు : విద్యుత్‌ ‌కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే విద్యుత్‌ ‌సౌధను ముట్టడిస్తామని యునైటెడ్‌ ఎలక్ర్టిసిటీ కాంట్రాక్ట్‌ ‌వర్కర్స్‌ ‌యూనియన్‌ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫర్ అహ్మద్, బొజ్జ సుమన్ హెచ్చరించారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేయాలని, విద్యుత్ రంగ ప్రైవేటీకరణను నిలిపివేయాలని, తెలంగాణ తరహాలో కాంట్రాక్ట్ కార్మికులకు రూ.48 వేలు బేసిక్‌ ‌వేతనం ఇవ్వాలని విజయవాడ నుండి తిరుపతి వరకూ యునైటెడ్‌ ఎలక్ర్టిసిటీ కాంట్రాక్ట్‌ ‌వర్కర్స్‌ ‌యూనియన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్‌ ‌జాతా మంగళవారం తాడేపల్లి, మంగళగిరి నుండి గుంటూరు చేరుకుంది. నగరంలోని వివిధ సబ్‌ ‌స్టేషన్లను సందర్శించి కార్మికులతో మాట్లాడారు. గుజ్జనగుండ్లలోని విద్యుత్ స్టోర్ వద్ద జరిగిన కార్యక్రమంలో అహ్మద్, సుమన్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో శాశ్వత ఉద్యోగులతో సమానంగా కీలకమైన విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత, సమాన వేతనం కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. విద్యుత్‌ ‌రంగం ప్రైవేటీకరణ వల్ల కార్మికుల ఉద్యోగభద్రత ప్రమాదంలో పడుతుందని, ప్రజలపై భారాలు పడతాయన్నారు. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి కాంట్రాక్ట్, అవుట్‌‌సోర్సింగ్ కార్మికులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేసి, వారి సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వి రాం ప్రభాకర్, జిల్లా కార్యదర్శి దాసరి వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి పరిష్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు జి నాగరాజు, జి పవన్, పులి అనిల్, భాస్కర్, కె రాంబాబు, వర్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు బి లక్ష్మణరావు, నగర కార్యదర్శి బి ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్