మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅంబులెన్స్ ఢీకొని ఇద్దరు దుర్మరణం

1 గంట క్రితం

Ambulance.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 09:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-త్రిపురాంతకం (మార్కాపురం జిల్లా): మోటార్ సైకిల్‌‌ను అంబులెన్స్‌ ఢీకొన్న ఘటన మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని వెల్లంపల్లి-గొల్లపల్లి గ్రామాల మధ్య అమరావతి-అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే పై మంగళవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మోటార్‌ ‌సైకిల్‌ ‌మీద వస్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. ఎస్ఐ శివరామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సోమేపల్లి గ్రామానికి చెందిన నార్నపాటి కోటేశ్వరరావు (50), పల్లెపోగు ప్రసాద్ (23) వ్యక్తిగత పనుల నిమిత్తం స్వగ్రామం నుండి నుండి మోటార్ సైకిల్‌‌పై మార్కాపురానికి వెళ్తున్నారు. జాతీయ రహదారి మీదుగా మార్కాపురం వెళ్లే క్రమంలో వెల్లంపల్లి-గొల్లపల్లి గ్రామాల మధ్యలో గుంటూరు నుండి శ్రీశైలం వెళుతున్న అంబులెన్సు ఢీకొట్టింది. దీంతో మోటార్ సైకిల్‌‌పై ప్రయాణిస్తున్న వారిద్దరూ అక్కడికికక్కడే మృతి చెందారు. త్రిపురాంతకం పోలీసులు హుటాహుటిన ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఎస్ఐ శివరామయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్