రెండో రోజు కొనసాగుతున్న నామినేషన్లు పర్వం
ప్రజాశక్తి-చీరాల: స్థానిక ఎన్నికల నేపథ్యంలో చీరాల మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ రెండో రోజుకు చేరుకుంది. నామినేషన్ల దాఖలు సందర్భంగా పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. వివిధ వార్డుల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను మున్సిపల్ కార్యాలయంలోని ఎన్నికల అధికారులకు సమర్పిస్తున్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సిఐలు సోమశేఖర్, శశికుమార్, సుధాకర్, పలువురు ఎస్సైలు, పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.అయితే ప్రస్తుతానికి పలు వార్డుల నుండి సుమారు ఐదు నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం.








కామెంట్లు (0)