ప్రజాశక్తి - వేటపాలెం : వైశ్యుల అభ్యున్నతి లక్ష్యంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కార్యక్రమాలు చేపడుతుందని బాపట్ల జిల్లా ఐవిఎఫ్ అధ్యక్షుడు దోగుపర్తి బాలక్రిష్ణ అన్నారు.ఐవిఎఫ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు అందించిన ఆర్థిక సహకారంతో అడ్వకేట్ గా పనిచేస్తున్న చేబ్రోలు రాజేశ్వరికి కంప్యూటర్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ మామిడిపాక హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ చీరాల పట్టణ అధ్యక్షులు దోగిపర్తి సురేష్, స్టేట్ కోఆర్డినేటర్ గొంట్ల కోమలి, ఆర్గనైజింగ్ సెక్రటరీ తమ్మన పవన్ కుమార్ యువజన విభాగ గౌరవ అధ్యక్షులు కుమ్మరగుంట రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఐవిఎఫ్ ద్వారా సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ మరింత మందికి చేయూత అందిస్తామని ఫెడరేషన్ ప్రతినిధులు అన్నారు.
వైశ్యుల అభ్యున్నతికి చేయూత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 10:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)