శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేయాలి - నల్లమడ రైతుల డిమాండ్

1 గంట క్రితం

WhatsApp Image 2026-08-29 at 5.45.41 PM.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 06:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 14 వ రోజుకు చేరిన రైతుల దీక్షలు.

ప్రజాశక్తి పర్చూర్: గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించేందుకు అవసరమైన భూసేకరణ కొరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పటి వరకు రైతుల పోరాటం కొనసాగుతుందని అన్నారు. నల్లమడ పర్చూరు ప్రాంతానికి సాగు,తాగునీరు కోరుతూ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం 14 వ రోజుకు చేరుకున్నాయి. కృష్ణా జలాలు పర్చూరుకు వచ్చేవరకు నిరసనలు కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిరసన దీక్షల లో చిననందిపాడు, అడుసుమల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు. నల్లమడ రైతు సంఘం నాయకులు కొల్లా రాజ్ మోహన్ రావు , కొత్త శేషయ్య, కొమ్మినేని శ్రీనివాసరావు, తెలగతోటి పేతురు, ఎండేవిడ్, కమ్మ సంజీవరావు ,నాయుడు సుబ్బారావు, మళ్లీ నీడి జగన్నాథం, కొత్తపల్లి ప్రసాద్,దొప్పలపూడి నాగయ్య, తేళ్ల గోపి ,గడ్డం వేణుబాబు రైతులు దీక్షలో పాల్గొనగా, వై అంకమ్మ చౌదరి, తోకల కృష్ణమోహన్, కోట హరిప్రసాద్ ఒగ్గి శెట్టి నరసింహం,నరిశెట్టి శ్రీనివాసరావు, యద్దనపూడి హరిప్రసాద్, రావూరి వెంకట ప్రసాద్,లగడపాటి వీరాంజనేయులు, తులసి శివ నాగేశ్వరరావు, లంక భారత్,కొల్లా శ్రీహరి, పులిపాటి రవి, బండి రాంబాబు, చింతగుంట శ్రీను,తదితరులు దీక్షలో కూర్చున్న రైతులకు సంఘీభావం తెలిపారు. రైతులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసిల్దార్ కు అందజేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్