శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

"ప్యారడైజ్" రెండో పాట 'యేష నాగుల కట్ట మీద' విడుదల

1 గంట క్రితం

song.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 05:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల

నేచురల్ స్టార్ నాని, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్'. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్‌తో అంచనాలను పెంచేసిన ఈ చిత్రం నుంచి మరో సర్ప్రైజ్ వచ్చేసింది. 'యేష నాగుల కట్ట మీద' అంటూ సాగే రెండో పాటను చిత్రబృందం వినూత్నంగా విడుదల చేసి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పాటను అమెరికాలోని డల్లాస్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ నిర్వహిస్తున్న లైవ్ కాన్సర్ట్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి నాని 'జడల్' పాత్ర గెటప్‌లో (పొడవాటి జుట్టు, రెక్కల డిజైన్‌తో ఉన్న ప్రత్యేక జాకెట్‌తో) సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి అభిమానులను ఉర్రూతలూగించారు. తాజాగా యూట్యూబ్ లో ఈ పాటను విడుదల చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్