శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వాడరేవు సర్పంచ్ అభ్యర్థిగా పీక్కి నారాయణ నామినేషన్ దాఖలు

16 నిమిషాల క్రితం

Peekki Narayana files nomination as Sarpanch candidate for Vadarevu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 02:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎమ్మెల్యే కొండయ్య తనయులు అమర్నాథ్, మహేంద్ర నాధ్ లతో ర్యాలీ

- అధికారులకు నామినేషన్ పత్రాలు దాఖలు


ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : చీరాల మండలం వాడరేవు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పీక్కి నారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే ఎంఎం. కొండయ్య తనయులు గౌరీ అమర్నాథ్, మహేంద్రనాథ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పీక్కి నారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పారిశుద్ధ్యం, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతో వాడరేవు గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటుపడతానని పీక్కి నారాయణ తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్