ప్రజాశక్తి - నిజాంపట్నం : నిజాంపట్నం గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు నెలనెలా వేతనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గత 20 ఏళ్లుగా పంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్న వారిలో అధిక సంఖ్యలో ఉన్నారని, సకాలంలో వేతనాలు అందకపోవడంతో కుటుంబాల పోషణ భారంగా మారి అప్పులపాలవుతున్నారని తెలిపారు. కనీస అవసరాలకు సైతం కిరాణా దుకాణాల్లో అప్పులు పుట్టని పరిస్థితి నెలకొందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న కార్మికులపై అధికారులు, మేస్త్రీలు బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. 10 నిమిషాలు ఆలస్యమైనా వేతనాల్లో కోత విధిస్తున్నారని, ఇష్టమైతే పని చేయాలని, లేకపోతే మానేయాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఐదుగురు కార్మికులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారని, దీంతో ఉద్యోగ భద్రతపై కార్మికుల్లో ఆందోళన నెలకొందన్నారు.
పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి
56 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 01, 2026, 03:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)