శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పట్టణంలో బంద్, ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు పోలీస్ అనుమతి లేదు

23 ఆగస్టు, 2026

Police permission has not been granted for the bandh, dharnas, or protest activities in the town.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 03:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పర్చూరు (బాపట్ల) : బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 24న సోమవారం ఎటువంటి బంద్, ధర్నా, ర్యాలీ, నిరసన లేదా ఇతర ప్రజా కార్యకలాపాలకు పోలీస్ శాఖ అనుమతి ఇవ్వలేదని ఎస్ఐ పి.గోపి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్చూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, దుకాణాలు మరియు ఇతర సంస్థలు యథావిధిగా తమ సాధారణ కార్యకలాపాలను కొనసాగించాలని ఎటువంటి బలవంతపు బంద్‌కు సహకరించరాదని ఎస్ఐ పేర్కొన్నారు. పోలీస్ అనుమతి లేకుండా బంద్, ధర్నా, ర్యాలీ, రోడ్డుపై నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించడం లేదా ఇతరులను బలవంతంగా సంస్థలు మూసివేయించే ప్రయత్నం చేయడం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్‌ఐ పి. పులి గోపి మాట్లాడుతూ, పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎటువంటి వదంతులను నమ్మకుండా, చట్టాన్ని గౌరవిస్తూ తమ రోజువారీ కార్యకలాపాలను ప్రశాంతంగా కొనసాగించాలని సూచించారు. అదేవిధంగా, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే సందేశాలు లేదా ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రచారం చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. పోలీస్ అనుమతి లేకుండా ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించినా, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్