- భారీ ర్యాలీ.. వాడరేవులో నామినేషన్ దాఖలు
- ఎమ్మెల్యే కొండయ్య సహకారంతో నామినేషన్
ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : బుర్లవారిపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దొంతగుర్ల రాధాకృష్ణమూర్తి శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ వాడరేవు పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. గ్రామ ప్రజల మధ్య ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య సహకారంతో బుర్లవారిపాలెం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చొరవ తీసుకుంటూ బుర్లవారిపాలెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని రాధాకృష్ణమూర్తి స్పష్టం చేశారు.







కామెంట్‌లు (0)