శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజల సమస్యల పరిష్కారం ప్రభుత్వ లక్ష్యం : ‎మంత్రి అనగాని

14 జులై, 2026

Resolving people's issues is the government's goal: Minister Anagani
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 08:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రేపల్లె (బాపట్ల) : ‎ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు సోమవారం రేపల్లె టిడిపి కార్యాలయం నిర్వహించిన ప్రజాదర్బార్లో మంత్రి సత్యప్రసాద్ పాల్గొని స్వయంగా ప్రజల నుంచి వినతుల స్వీకరించారు నియోజవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. అధ్యయనం పరిశీలించిన మంత్రి వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ప్రజల సమస్యల.. పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యమని మంత్రి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వం అభివృద్ధి కంటే రాజకీయ అలజడులకు ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపుతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా 63 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గతంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వర్గాలు వెనుకంజ వేసే పరిస్థితి ఏర్పడిందని మంత్రి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంపై నమ్మకం పెరగడంతో పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను తిరిగి నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్