- గ్రామ ప్రజల అభీష్టానికే ఎమ్మెల్యే కొండయ్య ప్రాధాన్యం
- మండలంలో తొలి సర్పంచ్ అభ్యర్థి ప్రకటన
ప్రజాశక్తి – చీరాల: పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో చీరాల మండలంలోని పాత చీరాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బక్కా సౌమ్య పేరును ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రకటించారు.ఆ పంచాయతీ గ్రామ ప్రజల అభీష్టం మేరకు బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.పాత చీరాల గ్రామానికి చెందిన ప్రజలు బుధవారం ఎమ్మెల్యేను కలిసి సర్పంచ్ అభ్యర్థిగా బక్క సుభాష్ చంద్రబోస్ రెడ్డి సతీమణి బక్కా సౌమ్యకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎమ్మెల్యే ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో బక్కా సౌమ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించి, గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.
చీరాల మండలంలో తొలి సర్పంచ్ అభ్యర్థిని ప్రకటించడం ద్వారా ఎమ్మెల్యే ఎన్నికల సమరానికి ముందస్తు సంకేతాలు ఇచ్చారు. అభ్యర్థి ప్రకటనతో పాత చీరాల గ్రామంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.







కామెంట్‌లు (0)