- ఎమ్మెల్యే కొండయ్య సమక్షంలో నామినేషన్ దాఖలు
* జనసేన తరఫున కూటమి అభ్యర్థిగా పోటీ
ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : కొత్తపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి తరఫున జనసేన పార్టీ నాయకులు తన్నీరు ప్రసాద్ కొత్తపేట పంచాయతీలో నామినేషన్ దాఖలు చేశారు.శుక్రవారం నిర్వహించిన నామినేషన్ కార్యక్రమానికి చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా తన్నీరు ప్రసాద్‌కు మద్దతుగా కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నామినేషన్ ర్యాలీగా బయలుదేరి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)