ప్రజాశక్తి - మార్టూరు (బాపట్ల జిల్లా)
బాపట్ల జిల్లా మార్టూరు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన డాక్టర్ కొత్తగొర్ల అరవింద్.. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, పట్టుదలతో చదివి.. జాతీయస్థాయిలో ప్రతిభ చాటారు. ఎయిమ్స్ సహా దేశంలోని ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలల్లో పిజి ప్రవేశాల కోసం నిర్వహించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ లో 370వ ర్యాంకు సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు. రైతు శివనాగేంద్ర కుమారుడు అరవింద్ చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యలో మంచి ప్రతిభ చూపడంతో పాటు, నీట్ ప్రవేశ పరీక్షలో 1600వ ర్యాంకు సాధించి ఏలూరు అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబిబిఎస్ పూర్తి చేశారు. పీజీ ప్రవేశ పరీక్షల్లో జాతీయస్థాయిలో 370వ ర్యాంకు సాధించి తన లక్ష్యసాధనలో మరో కీలక ముందడుగు వేశారు. అరవింద్ సాధించిన విజయంపై ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.







కామెంట్‌లు (0)