ప్రజాశక్తి -కారంచేడు : బాపట్ల జిల్లా కారంచేడు మండలం దగ్గుబాడు మాజీ సర్పంచి , కారంచేడు మాజీ వైస్ ఎంపీపీ ముల్లా నూర్ అహ్మద్ ను పోలీసులు సోమవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకొని కారంచేడు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. సింగరాయకొండ విద్యార్థి తౌశిక్, అతని తల్లి మౌలాంబి మృతి పై న్యాయం చేయాలంటూ సోమవారం ధర్నా చేయాలని ప్రజాసంఘాలు అఖిలపక్షాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బాధితులకు న్యాయం చేయాలని ప్రజాసంఘాల ఆందోళనతో ప్రతిపక్ష నాయకులను , ప్రజాసంఘాల నేతలను అక్రమంగా నిర్బంధించడం అన్యాయమని అహ్మద్ ప్రజాశక్తికి తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఉన్న అహ్మద్ ను మాజీ ఎంపీపీ నీరుకట్టు వాసు బాబు , మాజీ సర్పంచ్ లు దండా చౌదరి బాబు, కారుమూడి సుబ్బారెడ్డి , వైసీపీ నాయకులు అప్పిరెడ్డి , ముళ్ళ సమద్ ఎస్ కే జాఫర్, తదితరులు పోలీస్ స్టేషన్లో ఆయనను పరామర్శించి సంఘీభావం తెలిపారు. మృతి చెందిన వారికి న్యాయం చేయాల్సింది పోయి వారికి మద్దతు తెలిపే ప్రజాసంఘాల ప్రతిపక్ష పార్టీ నాయకులను నిర్బంధించడం అన్యాయమని ఈ సందర్భంగా వారు తెలిపారు .
పోలీసుల నిర్బంధంలో వైసీపీ నాయకులు అహ్మద్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 12, 2026, 12:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)