ప్రజాశక్తి–బాపట్ల :చీరాల–రామాపురం బీచ్ రోడ్డుపై ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బాపట్ల జిల్లా భీమావారిపాలెంకు చెందిన యువ వైద్యుడు డాక్టర్ లేళ్ల వెంకట అనిరుధ్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు ప్రముఖ న్యాయవాది లేళ్ల శ్రీనివాసరావు పెద్ద కుమారుడు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో డాక్టర్ అనిరుధ్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనతో భీమావారిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో యువ వైద్యుడు అనిరుధ్ మృతి
18 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 11:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)