చిత్తూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సతీష్
ప్రజాశక్తి - చిత్తూరు యాదమరి : తోతాపురి మామిడి మదర్ ధరకు దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సతీష్ తెలిపారు. ప్రస్తుత సీజనులో తోతాపురి మామిడి కోత సమయంలో మామిడి ధరలు చాలా తక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఒక టన్నుకు మద్దతు ధరగా రూ. 4000/- ప్రకటించిందని అన్నారు. జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలోని రైతులు తమ పేరు, ఆధార్ నంబర్, మామిడి కాయల బరువు, బ్యాంకు ఖాతా వివరాలు, ఈ-పంట నమోదు వివరాలను సంబంధిత పత్రాలతో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, భూమి పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను తీసుకుని 10-08-2026లోపు రైతు సేవా కేంద్రంలో ధ్రువీకరించుకోవాలని సూచించారు. తోతాపురి మామిడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.








కామెంట్‌లు (0)