యువతి మృతి కి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి
25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి.
ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు గంగరాజు డిమాండ్
వి.కోట (చిత్తూరు) : వి కోట పిహెచ్ సి లో అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆశా వర్కర్ రాణి ఆత్మహత్యయత్నం చేసుకొని వేలూరు సీఎం సి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతి చెందారు. ఆమె మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గంగరాజు డిమాండ్ చేశారు. ఆమె మృతికి సిఐటియు నివాళులర్పించింది. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ .... రాణి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి యూనియన్ తరపున ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్ల ను వేధిస్తున్నారని అనేకసార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో ఇలాంటి దురదృష్టకర సంఘటన జరిగిందని తెలిపారు. గత నెలలో జిల్లా అధికారి సమక్షంలో జాయింట్ మీటింగ్ లో కూడా అధికారుల దృష్టికి వేధింపులు జరుగుతున్నాయని తీసుకురావడం జరిగిందన్నారు. ఆశా వర్కర్లతో చేయాల్సిన పనిని పక్కనపెట్టి అదనపు పనిని చేయించడం వలన పని ఒత్తిడి చేయలేక రకరకాల మానసిక ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. ఒక పక్క రాజకీయ వేధింపులు మరోపక్క అధికారులు వేధింపులు రోజురోజుకి పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకసారి డ్యూటీలో చేరిన తర్వాత ఏదైనా తప్పులు ఉంటే వారిని తొలగించాలి గాని కొత్త వారిని పెట్టుకోవాలనే సాకుతో ఉన్న వారిపై వేధింపులు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. రాణి వర్కర్ సంవత్సరం పాటు సంస్థకి ప్రజలకి ఉచిత సేవలు అందించినందుకు బహుమతి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఆమె మృతికి 25 లక్షల రూపాయలను చెల్లించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా జిల్లా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా సమావేశం తర్వాత జిల్లా విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ఆశా వర్కర్లు ఏ పని చేయాలో ఆ పనులు అన్ని పీహెచ్ సి లలో అమలు అయ్యే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)