మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వేటకొడవలితో దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు

5 రోజుల క్రితం

byreddipalli
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 05:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బాధితుడికి పలమనేరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స

ప్రజాశక్తి - బైరెడ్డిపల్లి: తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తిపై వేటకొడవలితో దాడి చేసిన ఘటన బైరెడ్డిపల్లి మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు, పోలీసులకు అందజేసిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బైరెడ్డిపల్లి మండలంలోని చప్పిడిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన పలని నాగార్జున అనే వ్యక్తులు వేటకొడవలితో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన గురువారం ఉదయం జరిగినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

ఫిర్యాదు ప్రకారం.. వెంకటేష్ తన ఇంటి వద్ద ఉండగా పలని, కన్యాకుమారి, నాగార్జున, నాగమణి, వాణి అక్కడికి వచ్చి వెంకటేష్‌పై వేటకొడవలితో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో వెంకటేష్ తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాయపడిన వెంకటేష్‌ను చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నట్లు వారు వెల్లడించారు. తనపై దాడి చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితుడు డిమాండ్‌ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. దాడికి గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్